పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో దూసుకెళ్లిన అభ్యర్థులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పార్వతీపురం
పార్వతీపురం మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జరిగింది. ఆరు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లను చేశారు. అందులో భాగంగా మొదటి రెండు రౌండ్లలో ఆరు వార్డుల ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. పార్వతీపురం మునిసిపల్ పరిధిలోని పలు వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించారు.