గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్‌ రోగులకు ఉచిత జన్యు పరీక్షలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: గుంటూరు

ఆంధ్రప్రదేశ్ వైద్యరంగంలో తొలిసారిగా క్యాన్సర్‌ రోగుల కోసం గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో అధునాతన జన్యు పరీక్షల ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ప్రయోగశాలను ఈనెల 22న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించనున్నారు. రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ల జన్యు మార్పులను గుర్తించే ఈ ఉచిత పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను ముందస్తుగా అంచనా వేసి మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.