మైక్స్ రెస్టారెంట్ బ్రాండ్లో భారీ పెట్టుబడులు పెట్టిన లెబ్రాన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Los Angeles

ఎన్బీఏ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ పాపులర్ రెస్టారెంట్ బ్రాండ్ అయిన మైక్స్ రెడ్ టాకోస్లో భారీ పెట్టుబడులు పెట్టి వార్తల్లో నిలిచారు. లాస్ ఏంజిల్స్ పరిధిలోని పసాదేనాలో కొత్త రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ పెట్టుబడి నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం, స్నేహితులను ఒక్కచోట చేర్చే ఆహార సంస్కృతిని తాను ఎంతగానో ఇష్టపడతానని ఈ సందర్భంగా లెబ్రాన్ జేమ్స్ తెలిపారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.