రావిగుంటపల్లిలో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ అంగన్వాడీ ఉత్సవం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పామూరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ కింద పామూరు మండలం రావిగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎంవీఎస్ పార్వతి, బీజేపీ మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.