తెలంగాణలో 130 మేనేజర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

తెలంగాణలోని నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో మల్టీ జోన్-2 పరిధిలోని 130 మేనేజర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 54,220 నుండి రూ. 1,33,630 వరకు వేతనం లభించనుండగా, అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 17, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.