'రేవంత్ తేల్చుకో.. కేసీఆర్‌ని దొర అంటవా.. భూస్వామి అంటవా': కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. కేసీఆర్‌ను దొర అంటవా లేక భూస్వామి అంటవా అని, ముందు నీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సూటిగా నిలదీశారు. సీఎం తీరును ఎత్తిచూపుతూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.