ఏషియన్ క్రీడల్లో రజతం గెలిచిన భారత షూటర్ల బృందం

రిపోర్టర్: గోపి స్థలం: Japan

జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ క్రీడల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. రెండవ రోజు పోటీలలో మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, వినోద్ విదర్శ బృందం రజత పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ కీర్తిని ఇనుమడింపజేసిన క్రీడాకారిణులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.