ఎన్నికల సంఘం అధికారి జ్ఞానేశ్కుమార్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేత చింతా మోహన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. నెల్లూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళలో విధులు నిర్వర్తించిన సమయంలో జ్ఞానేశ్కుమార్ అనేక తప్పులకు పాల్పడ్డారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.