మక్కెనవారిపాలెం: పారిశుద్ధ్య మెరుగుదలకు బిన్ బ్యాగ్ వినియోగంపై అవగాహన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సంతమాగులూరు

సంతమాగులూరు మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలో పారిశుద్ధ్య మెరుగుదల లక్ష్యంగా బుధవారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉప మండల అభివృద్ధి అధికారి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు, హరిత రాయబారులు ప్రతి ఇంటిని సందర్శించి బిన్ బ్యాగ్ వినియోగంపై ప్రజలకు వివరించారు. ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను రోడ్లపై పారబోయకుండా తడి, పొడి చెత్తను వేరుగా అందించాలని కోరారు.