ప్రముఖ అమెరికన్ ఫెమినిస్ట్ గ్లోరియా స్టైనమ్ కన్నుమూత
రిపోర్టర్: మహేష్
స్థలం: India
అమెరికన్ మహిళా ఉద్యమ నాయకురాలు, ప్రముఖ జర్నలిస్ట్ గ్లోరియా స్టైనమ్ (92) కన్నుమూశారు. తన యవ్వనంలో భారత్లో గడిపిన కాలం తనలో ఫెమినిజంపై అవగాహన పెంచిందని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని మిరాండా హౌస్లో నివసిస్తూ భారత స్వాతంత్ర్య ఉద్యమకారిణుల నుంచి స్ఫూర్తి పొందారు. సామాజిక న్యాయం, మహిళా హక్కుల కోసం ఐదు దశాబ్దాలకు పైగా పోరాడిన ఆమె మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది.