ముంబయి ట్రాఫిక్‌ కష్టాలపై నితిన్‌ గడ్కరీ తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: హరి స్థలం: మహారాష్ట్ర

ముంబయి రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్‌ కష్టాలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల తాను నిర్వహించిన కార్యక్రమానికి గంట ఆలస్యంగా వచ్చానని, తాను చేసిన తప్పునకు మూల్యం చెల్లిస్తున్నానని వ్యాఖ్యానించారు. నగరంలో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు అధునాతన మౌలిక వసతులు, కొత్త సాంకేతికతను అవలంబించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.