చినగంజాంలో పోలీసుల కార్డెన్ సెర్చ్: రౌడీ షీటర్ల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు

రిపోర్టర్: హరి స్థలం: చినగంజాం

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా చినగంజాం మండలంలోని సంతరావూరు గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంకొల్లు సీఐ రామా నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలోని రౌడీ షీటర్లు మరియు అనుమానితుల ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలంతా పూర్తిగా సహకరించాలని సీఐ కోరారు.