తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం విస్తరణ

రిపోర్టర్: అశోక్ స్థలం: తమిళనాడు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత అల్పాహార పథకాన్ని ఎనిమిదో తరగతి వరకు విస్తరించారు. పెరుంతలైవర్ కామరాజర్ ఉపాహార పథకం పేరుతో దీనిని కొనసాగిస్తూ చెన్నైలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ విస్తరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో పదహారు లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.