హెచ్సీయూ స్నాతకోత్సవం: మాతృభాష తెలుగులో బంగారు పతకం సాధించిన నాగరాజు
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన ఇరవై ఆరో స్నాతకోత్సవంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సారిపల్లి నాగరాజు మాతృభాష తెలుగులో బంగారు పతకం సాధించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి పీహెచ్డీ పూర్తి చేసిన తాను, ప్రస్తుతం అనంతపురం జిల్లా రాయదుర్గం డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా మాతృభాషకు సేవ చేయడమే తన తదుపరి ప్రధాన లక్ష్యమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.