మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన హనుమాన్ అంశ్ చిత్ర బృందం
రిపోర్టర్: నరేష్
స్థలం: ముంబై
నీమ్ కరోలీ బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన హనుమాన్ అంశ్ సినిమా ఘన విజయం సాధించడంతో దర్శకుడు విశాల్ చతుర్వేది నేతృత్వంలోని చిత్ర బృందం ముంబైలోని వర్షా బంగ్లాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణపతి బప్పా ఆశీస్సులు తీసుకున్న బృందాన్ని సీఎం ఫడ్నవీస్ అభినందించడమే కాకుండా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.