పాకిస్థాన్ మంత్రి చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీ స్వీకరించని భారత మహిళా జట్టు

రిపోర్టర్: రాము స్థలం: World

దుబాయ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకున్న భారత జట్టు, ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పొరుగు దేశంతో సంబంధాలపై దేశంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.