అనకాపల్లిలో 16 వేల మొక్కలతో విరూపాక్ష వినాయక ప్రతిమ ఏర్పాటు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో పర్యావరణ పరిరక్షణ సందేశంతో 16 వేల మొక్కలతో అద్భుతమైన వినాయక ప్రతిమను రూపొందించారు. ఈనెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విగ్రహాన్ని ప్రారంభించనుండగా, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు స్వామివారిని దర్శించుకోనున్నారు.