మహమ్మదాబాద్ కరువు మండలంగా ప్రకటించాలంటూ సీపీఎం నేతల డిమాండ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మహమ్మదాబాద్

మహమ్మదాబాద్ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం నాయకులు గుండుమల్ల నర్సింలు, వై. లక్ష్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. వర్షాభావ పరిస్థితులతో వరి, కంది పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ముప్ పై వేల రూపాయల పరిహారం అందించడంతో పాటు, కూలీలకు ఉపాధి హామీ కింద రెండు వందల రోజులు పనులు కల్పించాలని కోరారు.