ది ప్యారడైజ్ ప్రీ బుకింగ్స్‌లో నాని రికార్డు సృష్టి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 24 గంటల్లోనే బుక్ మై షో యాప్ ద్వారా మూడు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరోవైపు ఓవర్సీస్ ప్రీమియర్లకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయి, సినిమా కంటెంట్ సకాలంలో డెలివరీ కావడంతో సెప్టెంబర్ 23న ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు.