అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీకాకుళం
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఎంబ్రేయర్ సంస్థ ప్రతినిధి ఆర్జాన్ మేయర్‌కు ప్రసిద్ధ అరకు కాఫీని బహుమతిగా అందజేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో పండించే ఈ కాఫీ భారతదేశంలోనే అత్యుత్తమమైనదిగా నిలిచిందని ఆయన పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ దీన్ని రుచి చూడాలని సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు.