అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రోజర్ ఫెదరర్కు చోటు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో అధికారికంగా చేరారు. అమెరికాలోని న్యూపోర్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ప్రపంచ టెన్నిస్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఫెదరర్‌ను, క్రీడాకారుల విభాగంలో హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఆహ్వానించారు. ఈ వేడుకలో బ్రాడ్‌కాస్టర్ మేరీ కారిల్లో కూడా గౌరవం అందుకున్నారు.