ఓటీటీకి రవితేజ 'ఇరుముడి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భారతదేశం
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇరుముడి'. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 18 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. మద్యానికి బానిసైన తండ్రి భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం.