ఆరోగ్యానికి వరం పల్లీలు: రోజూ తింటే వృద్ధాప్యంలో బ్రెయిన్ కు అద్భుతమైన ప్రయోజనాలు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ప్రతిరోజూ తగిన మోతాదులో వేరుశనగలు తినడం వల్ల వృద్ధాప్యంలో మెదడు పనితీరు మెరుగవుతుందని మాస్ట్రిచ్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. పల్లీలలో ఉండే పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు అల్జీమర్స్ వంటి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనంలో తేలిందని నిపుణులు స్పష్టం చేశారు. ఉప్పు, కారాలు కలపకుండా తొక్కతీసి వేయించిన పల్లీలను మాత్రమే తీసుకోవాలని వారు సూచించారు.