విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పురపోరు: మొత్తం 71.38 శాతం పోలింగ్ నమోదు
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో ఉత్కంఠ భరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చిన్నపాటి ఘర్షణలు మినహా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని అధికారులు తెలిపారు. విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాల్ లో నిర్వహించిన ఈ ఎన్నికల్ లో మూడు ప్రాంతాలు కలుపుకుని మొత్తం 71.38 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.