స్థానిక సమరానికి వైఎస్సార్సీపీ సిద్ధం: మేయర్, ఛైర్మన్ అభ్యర్ధుల ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: Amaravati
స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన వైఎస్సార్సీపీ అధిష్టానం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు మరియు నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ సహా పలు కీలక స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.