బాధిత కుటుంబానికి అండగా గల్ఫ్ అసోసియేషన్ భరోసా

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన చిట్యాల భీమేష్ కుటుంబానికి ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ నాయకులు ఐదువేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. భీమేష్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో శనివారం గల్ఫ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మగ్గిడి తిరుపతి ఆధ్వర్యంలో నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఈ సాయం అందించారు. బాధిత కుటుంబాలకు అసోసియేషన్ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని తిరుపతి భరోసా ఇస్తూ, వారికి తగిన ధైర్యం చెప్పారు.