హిందూ పండుగలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: Karimnagar

కరీంనగర్ జిల్లా చింతకుంటలో వినాయక నిమజ్జనం కోసం నీరు కోరుతూ ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల సభ్యులపై పోలీసుల అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేతలు మండిపడ్డారు. హిందూ పండుగల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. శాంతియుతంగా నిమజ్జనం చేసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా అరెస్టులకు పాల్పడటం ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.