భారీవర్షాలపై సమీక్షలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
భారీవర్షాల నేపథ్యంలో వరదల్ని అంచనా వేసుకుంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. నీటి వనరులను నింపడంతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.