భారీ వర్షాల వేళ కోమిరి కాజ్వేను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం కోమిరి గ్రామం వద్ద ఉన్న కాజ్వేను సంయుక్త కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ శుక్రవారం పరిశీలించారు. కాజ్వే వద్ద వరద ప్రవాహం, రాకపోకల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, వరద తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు.