ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తీవ్రంగా వేధిస్తున్న అధ్యాపకుల కొరత

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టుల రేషనలైజేషన్‌ చేపట్టకపోవడంతో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం తెచ్చినా దానికి తగ్గట్లుగా నియామకాలు లేవు. ఒంగోలు, భీమిలి, చీపురుపల్లి, పుత్తూరుతో పాటు పలు కళాశాలల్లో ప్రధాన సబ్జెక్టులకు లెక్చరర్లు కరువయ్యారు. ఈ విద్యాసంవత్సరం అతిథి అధ్యాపకుల నియామకానికి సైతం ఉన్నత విద్యాశాఖ ఇప్పటివరకు అనుమతులు ఇవ్వకపోవడంతో విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.