ఓటమి భయంతోనే జగన్ తప్పుడు ప్రచారాలు: మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

పురపాలక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా అధినేత జగన్ వ్యక్తిగత ఆరోపణలు, తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో జగన్ శకునిలా కుట్రలు చేస్తూ తన మీడియా ద్వారా బురదజల్లుతున్నారని ఆయన విమర్శించారు. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి, అవకతవకలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.