మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ

రిపోర్టర్: హరి స్థలం: వరంగల్

మంత్రి పదవి నుంచి బర్తరఫ్, భద్రత తగ్గింపుతో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో, మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగు ఎటువైపు అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.