నేషనల్ హైవేపై లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: బద్వేలు

బద్వేలు మండల పరిధిలోని మడకలవారిపల్లె సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బండరాళ్లతో నెల్లూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.