ఆళ్లగడ్డ అభివృద్ధికి ఇరవై ఒక్క కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆళ్లగడ్డ
రాజకీయాల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము పనిచేస్తున్నామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురంలో పర్యటించి లబ్ధిదారులకు ఆమె పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఇరవై ఒక కోట్లతో పనులు చేపడతామని తెలిపారు. అధికారులే నేరుగా ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు అందించే భరోసాను కూటమి ప్రభుత్వం కల్పించిందని ఆమె పేర్కొన్నారు.