జేఎన్యూ ప్రొఫెసర్ తొలగింపుపై హైకోర్టు స్టే: ఎంపీ అకోయిజంకు భారీ ఊరట

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

లైంగిక వేధింపుల ఆరోపణలతో జేఎన్యూ ప్రొఫెసర్ అంగోమ్చ బిమోల్ అకోయిజం సేవలను తొగిస్తూ విశ్వవిద్యాలయ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించినట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ తొలగింపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అకోయిజం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అనూప్ జె భంభానీ విచారణ జరిపి విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది.