ఉద్యోగులకు ఊరట: పోస్టల్ బ్యాలెట్ గడువు మరో రెండు రోజులు పెంపు
రిపోర్టర్: శివ
స్థలం: గుంటూరు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల సౌకర్యార్థం పోస్టల్ బ్యాలెట్ గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. నవంబరు ఒకటి, రెండు తేదీల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడానికి వచ్చేవారు గుర్తింపు కార్డు, కేటాయింపు ఉత్తత్రులను తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.