వినాయకుడిని భక్తితో దర్శించుకున్న వానరం ఆకట్టుకున్న వైనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట కస్తూర్బా బాలికల విద్యాలయంలో గణేశ్ నవరాత్రి ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్దకు వచ్చిన వానరం సుమారు పది నిమిషాల పాటు అక్కడే కూర్చుని భక్తిని చాటుకుంది. ఈ అరుదైన దృశ్యాన్ని విద్యార్థినులు సెల్ఫోన్లలో బంధించారు. వానరం వెళ్లిపోయిన అనంతరం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థినులు వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.