అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదు.
రిపోర్టర్: సునీల్
స్థలం: వరల్డ్
9/11 వార్షికోత్సవం సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని అడ్డంపెట్టుకుని ఇరాన్‌పై దాడులను అమెరికా సమర్థించుకుంటోందని ఆరోపించింది. అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులకు ఇరాన్ లొంగబోదని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడతామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ స్పష్టం చేశారు.