ఎర్రవల్లిలో మిస్సయిన నలభై ఐదు ఎకరాల భూమిపై సీఎం రేవంత్ ఆరా

రిపోర్టర్: సతీష్ స్థలం: సిద్దిపేట

రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో రికార్డులకు, వాస్తవ పరిస్థితికి మధ్య ఏకంగా నలభై ఐదు ఎకరాల భూమి మిస్సయినట్లు క్షేత్రస్థాయి సర్వేలో తేలిందన్నారు. రికార్డుల్లో ఉన్న భూమి ఎక్కడుందో కచ్చితంగా తేల్చాలని, అన్యాక్రాంతమైతే వెలికితీయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కఠినంగా ఆదేశించారని అధికారులు స్పష్టం చేశారు.