'డ్రంక్ అండ్ డ్రైవ్': ఆటో డ్రైవర్‌కు 7 రోజుల జైలు శిక్ష
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
తిరుపతి జిల్లా నాయుడుపేటలో మద్యం సేవించి ఆటో నడుపుతున్న ఈ. సందీప్ కుమార్ అనే డ్రైవర్‌కు నాయుడుపేట జేఎంఎఫ్‌సీ కోర్టు 7 రోజుల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. నాయుడుపేట పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో నిందితుడు పట్టుబడ్డాడు. కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఈ తీర్పు వెలువరించారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు.