శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు బీభత్సం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: రంగారెడ్డి
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో సెవెన్‌హిల్స్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కంటైనర్‌ను తప్పించబోయి అదుపుతప్పిన బస్సు కిషన్‌గూడలోని బాలాజీ భవన్ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్‌లో టీ తాగుతున్న కరీంనగర్‌కు చెందిన అజ్మల్ మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు కార్లు ధ్వంసమయ్యాయి.