నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 2026-27 రిక్రూట్మెంట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2026-27 సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక పరీక్షల షెడ్యూల్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ ఇంజనీర్, సీపీఓ, సీహెచ్ఎస్ఎల్ పరీక్షలను నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలని కమిషన్ స్పష్టం చేసింది.