రాష్ట్రంలో రూ.2.91 లక్షల కోట్ల కేంద్ర ప్రాజెక్టులు
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్నట్లు కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. ఆగస్టు నెలాఖరుకు ఇందులో లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చయినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇంకా లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని పేర్కొంది. రూ.150 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులపై ప్రతి నెలా ఈ నివేదిక ఇస్తారు.