యువత భవితను నాశనం చేస్తున్న మత్తు వ్యసన మహమ్మారి
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
యువత మత్తు పదార్థాలకు, సెల్ఫోన్ వ్యసనానికి దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్ సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక సింగరేణి సంస్థ తిలక్ స్టేడియంలో జరిగిన 11వ బాలుర రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.