ఆన్లైన్ వెయిట్ లాస్ డ్రగ్స్పై టీజీ సేఫ్ కొరడా: రెడ్అలెర్ట్ జారీ

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

తక్కువ సమయంలో బరువు తగ్గాలనే ఆశతో ఆన్లైన్లో విక్రయిస్తున్న ప్రాణాంతక మందులు, పెప్టైడ్ల దందాపై తెలంగాణ ఆహార, నిత్యావసర ఔషధ ప్రమాణాల ప్రాధికార సంస్థ తీవ్రంగా స్పందించింది. ఎలాంటి అనుమతులు లేని అనధికారిక వెయిట్ లాస్ డ్రగ్స్ను వాడితే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించింది. ఈ మేరకు టీజీ సేఫ్ అధికారులు బుధవారం అత్యవసర పబ్లిక్ అడ్వైజరీ జారీ చేస్తూ, రోగులకు వీటిని సిఫారసు చేసే వైద్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని కఠినంగా హెచ్చరించారు.