స్మార్ట్ఫోన్ బ్యాటరీ రంగంలో విప్లవం: సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో భారీ మార్పులు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

స్మార్ట్ఫోన్ బ్యాటరీ రంగంలో సిలికాన్ కార్బన్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తెస్తోందని టెక్ నిపుణులు తెలిపారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని అందించే ఈ అతధునిక సాంకేతికతను చైనా బ్రాండ్లు వేగంగా విస్తరిస్తున్నాయి. రియల్ మీ, వివో వంటి ప్రముఖ కంపెనీలు పదివేల ఎంఏహెచ్ సామర్థ్యంతో స్మార్ట్ఫోన్లను రూపొందిస్తున్నాయని, అయితే ఆపిల్, గూగుల్ వంటి దిగ్గజాలు ఇంకా ఈ మార్పుపై దృష్టి పెట్టలేదని వారు పేర్కొన్నారు.