ఢిల్లీలో కూలిన పీజీ భవనం, ప్రాణాలతో బయటపడిన విద్యార్థి
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో పీజీ భవనం కూలిన ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థి నీరజ్ బావాను మూడు గంటల శ్రమ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, తీవ్ర గాయాలపాలైన నీరజ్ ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాద ఘటనలో మరో విద్యార్థి నిశాంత్ కూడా క్షేమంగా బయటపడ్డాడు.