'నన్ను తిరిగి హౌస్‌లోకి పంపండి': బిగ్ బాస్ 10లో రీ-ఎంట్రీ కోసం చరణ్, చైత్ర అభ్యర్థన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ 10 తెలుగు మొదటి వారంలో మిడ్-వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్ నుండి బయటకు వెళ్లిన ఆర్జే చరణ్, నటి చైత్ర రాయ్ లు రీ-ఎంట్రీ కోసం తాజాగా వీడియోలు విడుదల చేసి ప్రేక్షకులను అభ్యర్థించారు. నాగార్జున వీరిని నేరుగా ఇంటికే పంపించేశామని స్పష్టం చేసినప్పటికీ, తాజాగా మరో అవకాశం లభించడంతో సెప్టెంబర్ 16 మధ్యాహ్నం వరకు జరిగే ఓటింగ్‌లో తమకు ఓట్లు వేసి మళ్లీ హౌస్‌లోకి తీసుకురావాలని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.