పాలకొండ డిపోలో ఒత్తిడిని తరిమికొట్టేందుకు కదంతొక్కిన ఆర్టీసీ సిబ్బంది
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల కోసం సోమవారం ఉదయం పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ధనుంజయ్ గురూజీ ఆధ్వర్యంలో సిబ్బందికి ఆసనాలు, ప్రాణాయామం నేర్పించారు. విధి నిర్వహణలో ఒత్తిడిని యోగాతో జయించవచ్చని మాస్టర్ రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రమేష్, భాసురు కృష్ణమూర్తి తదితరులు పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.