చర్మ సమస్యలకు తీవ్ర హెచ్చరిక: సోరియాసిస్ వ్యాధితో ముప్పు తప్పదని వైద్యులు స్పష్టం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
సోరియాసిస్ అనేది కేవలం చర్మానికి మాత్రమే పరిమితమయ్యే వ్యాధి కాదని, దీని ప్రభావం నిద్ర, మానసిక ఆరోగ్యం, రోజువారీ జీవనంపై కూడా పడుతుందని చర్మవ్యాధుల నిపుణులు స్పష్టం చేశారు. చర్మంపై నిరంతర దురద, మంట, వాపు కారణంగా రాత్రిపూట నిద్రపోవడం కష్టమవుతుందని, దీనివల్ల పగటిపూట అలసట, మానసిక ఒత్తిడి పెరగడం జరుగుతుందని తెలిపారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి నిపుణులైన వైద్యుల సలహాతో తగిన చికిత్స తీసుకోవాలని అధికారులు సూచించారు.